OPPO F29 Pro 5G: అండర్వాటర్ ఫొటోగ్రఫీతో.. అన్‌లిమిటెడ్ ఫోటోలు.! 18 d ago

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో..ఇప్పుడు తన సరికొత్త F29 5G సిరీస్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ సిరీస్ మార్చి 20, 2025న విడుదల కానుంది. ఈ సిరీస్‌లో OPPO F29 5G, OPPO F29 Pro 5G అనే రెండు మోడళ్లు ఉంటాయి. ఈ ఫోన్లు అద్భుతమైన డిజైన్, మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తాయి. ఇది వినియోగదారులను ఆకర్షించే అత్యాధునిక ఫీచర్లతో రాబోతోంది. ఈ ఫోన్ మధ్య-శ్రేణి 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ లోని F29 Pro 5G మోడల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి!
OPPO F29 Pro 5G ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.7 అంగుళాలు AMOLED డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్: 120 Hz
ప్రాసెసర్: MediaTek Dimensity 7300
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, ColorOS
బ్యాటరీ: 6000 mAh
ఛార్జింగ్: 80W సూపర్ VOOC ఛార్జింగ్
బరువు : 180 గ్రాములు
డ్యూరబిలిటీ: IP66, IP68, IP69 రేటింగ్స్
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
- 50 MP మెయిన్ కెమెరా
- 2 MP మోనో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16 MP సెల్ఫీ కెమెరా
వేరియంట్స్:
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
- 12GB RAM + 256GB స్టోరేజ్
కలర్ ఆప్షన్స్:
- గ్రానైట్ బ్లాక్
- మార్బుల్ వైట్
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G సింగిల్ సిమ్
- Wi-Fi 6E
- బ్లూటూత్ 5.4
- USB టైప్-C
సెన్సార్లు: ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్
ప్లస్ పాయింట్స్:
- అందమైన AMOLED డిస్‌ప్లే
- సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
- 6000mAh భారీ బ్యాటరీ
- డస్ట్, వాటర్ ప్రూఫ్
మైనస్ పాయింట్స్:
- సింగిల్ సిమ్
- MediaTek కాకుండా Snapdragon ప్రాసెసర్ వచ్చుంటే బాగుండేది
- ధర కాస్త ఎక్కువ
OPPO F29 Pro మొబైల్ ఫీచర్లు అందర్నీ ఆకర్షించేలా ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరా చాల బాగుంది. ముఖ్యంగా దీని వాటర్ రెసిస్టన్స్ ఫీచర్ నీళ్లలో కూడా ఫోటోలు తీసే సదుపాయాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత సమాచారం బట్టి ఈ ఫోన్ ధర రూ.30 వేల లోపు ఉండవచ్చు. 6000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. OPPO F29 ప్రో 5G త్వరలో మీ దగ్గరలోని OPPO స్టోర్లలో మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రానుంది.
ఇది చదవండి: కొత్త రంగుతో.. అదిరిపోయే ప్రీమియం లుక్.!